మొదటి ఫోన్ అతనికే చేస్తాను – కల్యాణి ప్రియదర్శన్

Kalyani Priyadarshan

మలయాళీ యంగ్ బ్యూటీ కల్యాణి ప్రియదర్శన్ ‘హలో’, ‘చిత్రలహరి’, ‘రణరంగం’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గర అయింది. తాజాగా విడుదలైన కొత్త లోకలో సూపర్ ఉమెన్ పాత్రతో మరోసారి తెలుగు ప్రేక్షకులను ఆమె అలరించింది. ఇప్పటివరకు సరదా పాత్రలే చేసిన ఆమె, ఈ చిత్రంలో తొలిసారి స్టంట్స్‌ కూడా చేయడం విశేషం. ఈ నేపథ్యంలోనే వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ తన కెరీర్, వ్యక్తిగత జీవితం గురించి ఈ ముద్దుగుమ్మ అనేక విశేషాలు చెప్పింది. మరి ఆ ముచ్చట్లు ఏమిటో చూద్దాం రండి.

కల్యాణి ప్రియదర్శన్ మాట్లాడుతూ.. ‘మా స్వస్థలం కేరళ అయినప్పటికీ నేను చెన్నైలో పుట్టి పెరిగా. అమ్మానాన్న ఇండస్ట్రీకి చెందినవారు కాబట్టి చిన్నప్పుడు సెలవులు వస్తే వాళ్లతో కలిసి షూటింగులకి వెళ్లేదాన్ని. అప్పుడే నాకు సినిమాలపై ఆసక్తి పెరిగింది. దీంతో, 2017లో ‘హలో’ అనే తెలుగు చిత్రంలో హీరోయిన్‌గా అవకాశమొచ్చింది. అయితే, నా కెరీర్ లో నేను సరదా పాత్రలే చేశాను. ‘కొత్తలోక’లో మాత్రం మొదటిసారి యాక్షన్ సీక్వెన్స్‌ చేశాను. ఈ సినిమా కోసం ఆరు నెలలు ట్రైనింగ్ కూడా తీసుకున్నాను. సినీ ఇండస్ట్రీలో నాకు దుల్కర్ సల్మాన్ బెస్ట్ ఫ్రెండ్. నాకు ఏ కష్టమొచ్చినా, సలహా కావాలన్నా మొదటి ఫోన్ దుల్కర్ సల్మాన్‌కే చేస్తాను’ అంటూ కల్యాణి ప్రియదర్శన్ చెప్పుకొచ్చింది.

Exit mobile version