ఎంతో క్లాస్ గా మరియు హై స్టాండర్డ్స్ తో సినిమాలు తీసే డైరెక్టర్ గౌతం వాసుదేవ్ మీనన్ సినిమా తీసాడు అంటే అది రొమాంటిక్ ఎంటర్టైనర్ లేదా యాక్షన్ థ్రిల్లర్ అయినా అయి ఉండాలి. అలాంటి గౌతం మీనన్ మరోసారి ‘ఎటో వెళ్ళిపోయింది మనసు’ అనే లవ్ స్టొరీతో మళ్ళీ మన ముందుకు రానున్నారు. ఇటీవలే జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ‘ అందరూ నేను హాలీవుడ్ సినిమాలు ఇన్స్పిరేషన్ తీసుకుంటానని అంటుంటారు, అవన్నీ నిజాలు కావు. నాకు మణిరత్నం గారు తీసిన రొమాంటిక్ మూవీస్ ‘మౌన రాగం’ మరియు ‘సఖి’ సినిమాలంటే చాలా ఇష్టం. అందులోనూ ముఖ్యంగా ‘సఖి’ సినిమాలోని ‘కలలై పోయెను నా ప్రేమలు’ పాట అంటే చాలా ఇష్టం. ఆయన తీసిన ఆ ఒక్క పాటతోనే ఇంకో 15 సినిమాలు చేస్తాను. ఆ పాటే నాకు ఇన్స్పిరేషన్ అని’ అన్నాడు.
తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించిన ఈ సినిమాలో కామన్ హీరోయిన్ సమంత కాగా తెలుగులో నాని మరియు తమిళంలో జీవా హీరోలుగా నటించారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలో ఉన్న ఈ సినిమా డిసెంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించారు.