ఆ నమ్మకాన్ని కలిగించాలి – అనుష్క

Anushka-1
‘సూపర్’ సినిమాలో గ్లామరస్ పాత్రతో తెలుగువారికి పరిచయమైన కన్నడా యోగా బ్యూటీ అనుష్క. ఆ తర్వాత కూడా గ్లామరస్ పాత్రల్లోనే కనిపించింది. ఆమెకి క్రేజ్ తెచ్చిన ‘విక్రమార్కుడు’ సినిమాలో కూడా గ్లామర్ కి ప్రాదాన్యం ఉన్న పాత్రే దక్కింది. కానీ ఆ తర్వాత చేసిన ‘అరుంధతి’ సినిమాతో టాలీవుడ్లో నటిగా తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకుంది. అలాంటి ఈ భామను అరుంధతి తర్వాత అలాంటి సినిమా ఆఫర్లు రాలేదా అని అడిగితే ‘ చాలానే వచ్చాయి కానీ నాకు నచ్చలేదు. నాకు నచ్చితేనే సినిమా చేస్తాను. అలాగే ఆ సినిమాతో దర్శకులకి అనుష్క ఎలాంటి పాత్ర అయినా చేయగలదు, లేడీ ఓరియెంటెడ్ సినిమాలకి కూడా పూర్తి న్యాయం చేయగలదు అనే నమ్మకం ఉంది. ఆ నమ్మకం వల్లే నాకు ‘రుద్రమదేవి’ లాంటి సినిమాలో నటించే అవకాశం వచ్చిందని’ అనుష్క అంది.

ప్రస్తుతం అనుష్క ప్రభాస్ సరసన ‘మిర్చి’ సినిమాలో నటించింది. ఈ సినిమా 2013 మొదట్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే తను చేయనున్న ‘రుద్రమదేవి’ మూవీ ఫిబ్రవరి నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది.

Exit mobile version