ఆయన్ని చూసే పెద్ద స్టార్ అవ్వాలనుకున్నాను – అక్కినేని

ANR-talks-about-Mayabazar
తెలుగు సినిమా ఇండస్ట్రీలో లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్న మొదటి హీరో అక్కినేని నాగేశ్వరరావు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. అలాంటి అక్కినేని ఇంతటి స్టార్ అవ్వడానికి ప్రభావితం చేసిన అంశాల గురించి చెబుతూ ‘ నేను ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మొదట్లో విలక్షణ నటుడు చిత్తూరు నాగయ్య గారు ఒక పెద్ద స్టార్. నటుడిగా ఆయనకి ఉన్న పేరు, స్టార్డం చూసిన తర్వాతే ఆయన అంత వాడిని కావాలని లక్ష్యం పెట్టుకొని కష్ట పడ్డాను. అలాగే ఆయన ద్వారా ‘మితిమీరిన దానగుణం అనర్థ హేతువు’ అనే దానిని కూడా తెలుసుకున్నాను. ఆయన జీవితాన్నే చూసే ఈ రెండు అంశాలు నేర్చుకున్నానని’ నాగేశ్వరరావు అన్నారు. ఈ రోజు చిత్తూరు నాగయ్య గారి వర్ధంతి సందర్భంగా అక్కినేని ఆయనతో పయనించిన గత స్మృతుల్ని గుర్తు చేసుకున్నారు.

Exit mobile version