డైరెక్టర్ కావాలనుకుంటే హీరోని చేసాడు.!


స్వతహాగా తెలుగు వాడైనప్పటికీ ముందు తమిళనాట హీరోగా నిలిచి ఆ తర్వాత తెలుగులో హీరోగా పేరు తెచ్చుకున్నాడు విశాల్. విశాల్, త్రిష, సునైన ప్రధాన పాత్రలు పోషించిన ‘వేటాడు వెంటాడు’ సినిమా డిసెంబర్ మూడవ వారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. యువన్ శంకర్ రాజ మ్యూజిక్ అందించిన ఈ సినిమా ఆడియో రిలీజ్ నిన్న రాత్రి హైదరాబాద్లో జరిగింది. ఈ వేడుకలో విశాల్ మాట్లాడుతూ ‘ నా పాటికి నేనోదో డైరెక్టర్ అవుదాం అనుకుంటున్నా నేను హీరో అవ్వడానికి కారణం డా. మోహన్ బాబు. నాన్నగారు డా. మోహన్ బాబు గారితో ‘ఎం. ధర్మరాజు ఎం.ఎ’ సినిమా తీస్తున్న టైములో ఆయన నన్ను చూసి నాన్నకి నన్ను హీరో చేయమని చెప్పాడు. ఆయన ఏమని చెప్పాడో గానీ మా నాన్న నన్ను చివరికి హీరోగా మీ ముందు నిలబెట్టాడు. మోహన్ బాబు గారు చెప్పకపోయి ఉంటే హీరోలా నేను మీముందుకు వచ్చే వాన్నే కాదు. ఈ సందర్భంగా ఆయనకీ నా కృతఙ్ఞతలు తెలుకుంటున్నానని’ అన్నాడు. తిరు ఈ సినిమాకి డైరెక్టర్.

Exit mobile version