నా పాత్రలు నాకెప్పుడూ బోర్ కొట్టలేదంటున్న కాజల్

Kajal

ప్రస్తుతం టాప్ హీరోయిన్స్ లో ఒకరుగా వెలుగొందుతున్న కాజల్ అగర్వాల్ ఈ సంవత్సరం నటించిన ‘నాయక్’, ‘స్పెషల్ 26’, ‘బాద్షా’ సినిమాలు బాక్స్ ఆఫీసు వద్ద మంచి విజయాన్ని సాదించాయి. అలాగే ప్రస్తుతం కాజల్ నటిస్తున్న రెండు ద్విభాషా చిత్రాల్లో నటిస్తోంది ఆ సినిమాలు వచ్చే సంవత్సరం ప్రేక్షకుల ముందుకు రావచ్చు. ఈ మద్య జరిగిన ఇంటర్వ్యూలో ఒకేరకమైన పాత్రలు చేయడం మీకు బోర్ కొట్టడం లేదా అనడిగితే కాజల్ సమాధానమిస్తూ ‘ ఆన్ స్క్రీన్ నేను చేస్తున్న పాత్రల విషయంలో ఎప్పుడూ బోర్ ఫీలవ్వను. ప్రేక్షకులు పక్కింటి అమ్మాయిలా, పెళ్ళికాని అమ్మాయిలా చూడాలనుకుంటే అలాంటి పాత్రలు చేయడానికి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. చెప్పాలంటే మొదటిసారి ‘బాద్షా’ లో పూర్తి కామెడీ రోల్ చేసాను, ఆ రోల్ చేస్తాప్పుడు బాగా ఎంజాయ్ చేసాను’ అంది.

అలాగే తన డ్రీం రోల్స్ గురించి చెబుతూ ‘ నాకు పోలీస్ ఆఫీసర్ గా, స్టంట్స్ చేసే యాక్షన్ రోల్స్ చెయ్యాలని ఉంది. ముఖ్యంగా ఒక ఫుల్ లెంగ్త్ రొమాంటిక్ ఫిల్మ్ చెయ్యాలని ఉంది. ఎలాంటిదంటే రిచర్డ్ లింక్ లేటర్ తీసిన ‘బిఫోర్ సన్ రైస్’, ‘బిఫోర్ సన్ సెట్’ లాంటి సినిమాలు చేయాలని ఉంది. నేను ఇదివరకూ లవ్ స్టోరీలు చేసాను కానీ ‘బిఫోర్ సన్ రైస్’, ‘బిఫోర్ సన్ సెట్’ సినిమాలు చేయలేదని’ కాజల్ తన మనసులోని మాట బయట పెట్టింది. ప్రస్తుతం కాజల్ రామ్ చరణ్ ‘ఎవడు’ సినిమా షూటింగ్లో బిజీ గా ఉంది. ఇది కాకుండా కార్తీ సరసన ‘ఆల్ ఇన్ ఆల్ అజుగు రాజు’, విజయ్ సరనస ‘జిల్లా’ సినిమాల్లో నటిస్తోంది.

Exit mobile version