‘వారణాసి’: మహేష్ ఫ్యాన్స్ కి జక్కన్న స్పెషల్ థాంక్స్!

varanasi

ప్రస్తుతం ఒక్క పాన్ ఇండియా సినిమానే కాకుండా పాన్ వరల్డ్ లెవెల్లో హాట్ టాపిక్ గా మారిన ఇండియన్ సినిమా ఏదన్నా ఉంది అంటే అది సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళిల “వారణాసి” అనే చెప్పాలి. ఇక ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న అభిమానులుకి కేవలం ఈ అనౌన్సమెంట్ తోనే ఫుల్ మీల్స్ పెట్టినంత పని జక్కన్న చేశారు. ఇక ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ కి నిన్న నిర్వహించిన ఇండియాస్ బిగ్గెస్ట్ ఈవెంట్ కి లక్షలాది మంది అభిమానాలు ఖండాంతరాలు దాటి వచ్చారు.

మరి ఈ ఈవెంట్ కి అంతమంది వచ్చి ఘనంగా సక్సెస్ చేయడంతో దర్శకుడు రాజమౌళి తన అభిమానులు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అంతే కాకుండా మహేష్ బాబు అభిమానులు కూడా తమ హీరో లానే ఎంతో డిసిప్లిన్ కలవారు అని కొనియాడారు. అలాగే తమతో నిలబడ్డ ప్రతీ తెలుగు సినిమా అభిమానికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను అని పోస్ట్ చేశారు.

Exit mobile version