ఎమోషనల్ గా ట్వీట్ చేసిన మహేష్ !

ఎమోషనల్ గా ట్వీట్ చేసిన మహేష్ !

Published on Jul 20, 2020 12:03 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి సితార పుట్టినరోజు నేడు. ఈ రోజు తన 8వ పుట్టినరోజు జరుపుకుంటుంది. ఈ సంధర్భంగా సూపర్ స్టార్ ఈ ప్రత్యేక రోజున సితారకు భావోద్వేగమైన ప్రేమతో విషెష్ చెబుతూ ట్వీట్ చేశారు. “చాల వేగంగా ఎనిమిదేళ్లు గడిచాయి. నీకు ఎప్పటికీ తెలియని విధంగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు” అని మహేష్ తన ‘సితు పాపా టర్న్స్ 8’ అనే హ్యాష్‌ట్యాగ్‌ ను కూడా యాడ్ చేస్తూ ట్వీట్ చేశాడు.

ఇక సితార జీవితంలో కొన్ని ఉత్తమ క్షణాలకు సంబంధించి చిన్న వీడియోను కూడా అభిమానులతో మహేష్ పంచుకున్నారు. సోషల్ మాధ్యమాలలో ఈ లిటిల్ ఏంజెల్ కి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. చిత్ర పరిశ్రమకు చెందిన తారలతో పాటు, మహేష్ అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్స్ పెడుతున్నారు. సితార వయసు చిన్నదే అయినప్పటికీ సోషల్ మాధ్యమాలలో యాక్టీవ్ గా ఉంటుంది.

తాజా వార్తలు