ఇండస్ట్రీలో తనకు గాడ్ ఫాదర్స్ లేరు అంటుంది గోవా బ్యూటీ ఇలియానా. ఇప్పటి వరకు తనకు ఇండస్ట్రీ గురించి ఎలాంటి సలహాలు ఇవ్వలేదని, నా కెరీర్ మలుచుకోవడంలో ఎలాంటి గాడ్ ఫాదర్ అవసరం రాలేదు అంటుంది. అద్రుష్టవశాత్తు ఇండస్ట్రీలో తన ప్రయాణం సాఫీగా సాగిందనీ, మొదట్లో కొన్ని సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ కాలక్రమేనా వాటిని నేను అధిగమించాను. ప్రస్తుతం ఇలియానా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన ‘జులాయి’ చిత్రంలో, పూరి జగన్నాధ్ డైరెక్షన్లో రవితేజ సరసన ‘దేవుడు చేసిన మనుషులు’ చిత్రాల్లో నటిస్తుంది. ఇవే కాకుండా హిందీలో రణ్ బీర్ కపూర్ సరసన ‘బర్ఫీ’ సినిమాల్లో నటిస్తుంది.