నాకు సినిమా తప్ప మరో ఆప్షన్ లేదు – రానా దగ్గుబాటి

నాకు సినిమా తప్ప మరో ఆప్షన్ లేదు – రానా దగ్గుబాటి

Published on Nov 11, 2012 12:20 PM IST

యాక్టర్ ని కాకపోయుంటే డాక్టర్ అయ్యుంటాను అని చాలా మంది నటులు అంటుంటారు ఇలానే ఎవరి ఆప్షన్లు వారికి ఉంటాయి కాని హీరో రానా దగ్గుబాటి మాత్రం తనకి సినిమా కాకుండా మరో ఆప్షన్ లేదు అని అంటున్నారు. ఒకానొక ప్రముఖ పత్రికతో మాట్లాడుతూ “నా చిన్నతనం నుండి డబ్బింగ్,ఎడిటింగ్, ప్రొడక్షన్ మరియు కెమెరా అనే పదాలు అలవాటు అయిపోయాయి. నాలో సినిమా రక్తం ప్రవహిస్తుంది. అదే నన్ను సినిమా వైపు మొగ్గు చూపేల చేసింది. నాకు కెరీర్ గా సినిమాను ఎంచుకోవడం తప్ప మరో ఆప్షన్ లేకుండా పోయింది” అని చెప్పారు. రానా త్వరలో “కృష్ణం వందే జగద్గురు” చిత్రంలో కనిపించనున్నారు. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. నవంబర్ చివర్లో ఈ చిత్రం విడుదల కానుంది.

తాజా వార్తలు