తెలుగు ప్రేక్షకుల హాట్ ఫేవరేట్ షో బిగ్ బాస్ సీజన్ 4 కు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. వచ్చే నెల చివరి వారం నుండి బిగ్ బాస్ షో మొదలుకానుంది అని సమాచారం అందుతుంది. మరో వారం రోజుల్లో అందుకు సంబంధించిన ప్రోమోలు సైతం విడుదల కానున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే కంటెస్టెంట్స్ జాబితాపై కూడా ఓ క్లారిటీ వస్తోంది. ఇప్పటికే ఎంపిక పూర్తి అయినట్లు సమాచారం.సరికొత్త అంశాలతో ప్రేక్షకులను అలరించడానికి షోని సిద్ధం చేస్తున్నారట. ఈ క్రమంలోనే యూట్యూబ్ స్లార్, ఫ్రస్టేటెడ్ విమెన్ సునయన కూడా షోలో పాల్గొనబోతున్నట్లు వార్తలు రావడం జరిగింది. ఫ్యామిలీ ఆడియెన్స్ లో ఉన్న క్రేజ్ నేపథ్యంలో ఆమెను సెలక్ట్ చేసినట్టు సమాచారం. అలాగే ఈ షోలో ఎపిసోడ్ కు లక్ష రూపాయలు తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. వీటిపై సునయన స్పందించారు.
పుకార్లపై మండిపడిన సునయన వీటిని ఎవరు పుట్టిస్తారో తెలియదు అని అసహనం వ్యక్తం చేశారు.తనను షో కోసం ఎవరూ సంప్రదించలేదని స్పష్టం చేశారు. తనకు ఇప్పుడు మూడున్నర ఏళ్ల కొడుకు ఉన్నాడని, అతడే ప్రస్తుతం తన లోకం అని నటి చెప్పుకొచ్చింది. అతడికి 7,8 ఏళ్లు వచ్చేవరకు మరోవైపు పెద్దగా ఫోకస్ పెట్టనని సునయన వివరించింది.