సమంత తెలుగులో నటించిన మొదటి నాలుగు హిట్ సినిమాలే కావడంతో ఆమెకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో విపరీతమైన క్రేజ్ ఉంది. ఆమెకి తమ సినిమాలో అంటే తమ సినిమాలో నటించామంటూ ఆఫర్లు వస్తున్నాయి. అయితే ఆమెకి ఇటీవల ఆమెకి ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో చాలా సినిమాలు వదులుకోవాల్సి వచ్చింది. ఈ రోజు ఏర్పాటు చేసిన హిమోఫిలియో అవేర్నెస్ ప్రోగ్రాంలో పాల్గొన్న ఆమె తను నటిస్తున్న సినిమాల గురించి మాట్లాడుతూ తను మిస్ సినిమా అవకాశాల గురించి బాధపదట్లేదని. తనకు టాలెంట్ ఉంది కాబట్టి మళ్లీ అవకాశాలు తనని వెతుక్కుంటూ వస్తాయని అంటుంది. ప్రస్తుతం తను సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ఎవడు, ఎటో వెళ్ళిపోయింది మనసు, నందిని రెడ్డి డైరెక్షన్లో సిద్ధార్థ్ సరసన ఒక సినిమా, ఆటో నగర్ సూర్య సినిమాలతో బిజీగా ఉన్నానని అంటుంది.