నెంబర్ 1 గేమ్ ని నమ్మనంటున్న అనుష్క

నెంబర్ 1 గేమ్ ని నమ్మనంటున్న అనుష్క

Published on Dec 1, 2013 1:47 PM IST

anushka
ఈ మధ్య కాలంలో ఒక సినిమా మొత్తాన్ని తన భుజాలపై వేసుకొని నడిపించగల కథానాయిక అంటే అందరూ అనుష్క పేరే చెప్తారు. అరుంధతి సినిమా తర్వాత ఏ డైరెక్టర్ అయినా పీరియాడికల్ సినిమా తీయాలంటే మొదటగా అనుష్కనే ఎంచుకుంటున్నారు. అనుష్క ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి తీస్తున్న ‘బాహుబలి’, గుణశేఖర్ తీస్తున్న ‘రుద్రమదేవి’ సినిమాల్లోనటిస్తోంది. ఈ రెండు సినిమాల్లోనూ యువరాణి పాత్రల్లో కనిపించనుంది.

ఇటీవలే ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఫిల్మ్ మేకర్స్ మీపై 5 కోట్లు పెట్టడానికి కూడా సిద్దంగా ఉన్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటని అడిగితే అనుష్క ఓ నవ్వు నవ్వి ‘ 50 కోట్లు పెడుతున్నారంటే వాళ్ళు నాకు 50 కోట్లు ఇచ్చినట్లు కాదు. అది చాలా పెద్ద బాధ్యత. నా వరకు నా పాత్రకి పూర్తి న్యాయం చెయ్యడానికి ప్రయత్నిస్తానని’ సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం తెలుగులో రెండు పెద్ద సినిమాల్లో నటిస్తున్నారు. మరి నెంబర్ 1 హీరోయిన్ మీరే అని ఫీలవుతున్నారా అని అడిగితే ‘ నేను నెంబర్ గేమ్ ని నమ్మను. అలాంటిదేప్పుడు నా మైండ్ లోకి తీసుకోలేదు. సక్సెస్ అనేదానికి గ్యారంటీ లేదు. అందుకే శ్రద్దగా నా పని నేను చేసుకుంటానని’ అనుష్క సమాధానం ఇచ్చింది.

తాజా వార్తలు