నేను ప్రేక్షకులను మోసం చెయ్యదలుచుకోలేదు : శేఖర్ కమ్ముల

నేను ప్రేక్షకులను మోసం చెయ్యదలుచుకోలేదు : శేఖర్ కమ్ముల

Published on Feb 18, 2014 3:19 AM IST

sekhar-kammula
నయనతార తో ప్రస్తుతం అనామిక సినిమాను తెరకెక్కిస్తూ వస్తున్న దర్శకుడు శేఖర్ కమ్ముల. ఈ సినిమా ఒరిజినల్ వర్షన్ లో వుండే ఒక ముఖ్యమైన అంశాన్ని తెలుగులోకి వాడుకోవడంలేదు. అక్కడ విద్యాబాలన్ గర్భవతిగా నటిస్తుంది. ఇక్కడ నయన్ మమోలుగానే కనిపించింది. ఈ విషయం పై చాలా మంది శేఖర్ ను ప్రశ్నించారు

ఇటీవలే జరిగిన ఈ సినిమా తమిళ వర్షన్ ట్రైలర్ లాంచ్ లో మాట్లాడినప్పుడు కూడా అక్కడ మీడియా శేఖర్ ను ఇదే ప్రశ్నించగా దానికి శేఖర్ ఈ విధంగా సమాధానమిచ్చుకున్నాడు. “కహానీ ఒక అధ్బుతమైన స్క్రిప్ట్. కానీ నాకు ఆ ‘ఛీట్ ఎలిమెంట్’ మాత్రం నచ్చలేదు” అని అన్నాడు. ప్రేక్షకులకు లేనిది వున్నట్టు చూపించి వారిని మోసం చెయ్యలేనని చెప్పాడు

మంచికో చెడుకో తెలియదుగానీ స్క్రిప్ట్ లో ముఖ్యమైన ఈ భాగాన్ని మార్చడం వల్ల ఈ సినిమా పై ఆసక్తి పెరిగింది. ఈ తెలుగు, తమిళ వర్షన్ లలో ఇంకా ఏమేమి మార్పులు వుంటాయో చూడాలి

తాజా వార్తలు