నేను దర్శకుడవ్వడానికి అదే కారణం

నేను దర్శకుడవ్వడానికి అదే కారణం

Published on Nov 2, 2012 2:09 PM IST


కెరీర్ మొదటి నుంచి ‘షో’, ‘మిస్సమ్మ’, ‘సదా మీ సేవలో’, ‘మిస్టర్ మేధావి’ మరియు ‘ విరోధి’ లాంటి విభిన్నమైన సినిమాలను తీస్తున్న దర్శకుడు నీలకంఠ. ప్రస్తుతం నీలకంఠ వరుణ్ సందేశ్ హీరోగా ‘చమ్మక్ చల్లో’ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈయన కొంతసేపు తన గత స్మృతుల్ని గుర్తుచేసుకొని ఆయన దర్శకుడవ్వడానికి గల కారణం ఏమిటో తెలిపారు. ‘ నేను 7వ తరగతి చదువుతున్నప్పుడు మా స్కూల్లో ప్రతి క్లాస్ వారు ఒక మాగజైన్ తయారు చేయాలని కాంపిటీషన్ పెట్టారు. మా క్లాస్ వాళ్ళు నేను నవలలు బాగా చదువుతానని దాని కోసం నన్ను ఒక కథ రాయమన్నారు. నేను ఇనిడ్ బ్లైటన్ రాసిన ఒక నవలని స్పూర్తిగా తీసుకొని ‘ఫీల్డ్స్ అఫ్ గోల్డ్’ అని ఒక కథని రాశాను. అది విన్న వాళ్ళు కొంత మంది కాపీ కొట్టావు కదా అన్నారు, కొంతమంది చాలా బాగుందన్నారు. మా మాగజైన్ కవర్ పేజీ ఫోటో ఒరిజినల్ కాదని మాకు ప్రధమ బహుమతి చేజారిపోయింది. అప్పుడే అర్థమయ్యింది ఎప్పుడైనా ఒరిజినాలిటీకి ఉండే ప్రాముఖ్యత మరియు గౌరవం మరొకదానికి ఉండదు అని. చిన్నప్పుడే నా మదిలో నాటుకు పోయిన ఈ విషయమే నన్ను దర్శకుడయ్యేలా చేసింది మరియు నేను ఇంత ఖచ్చిత స్వభావం కలిగిన వ్యక్తిగా ఉండటానికి కూడా ఇదే కారణమని, అందుకే నా సినిమాలన్నీ ఒరిజినల్ గా ఉంటాయని’ నీలకంఠ అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు