‘లీడర్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటి ప్రియ ఆనంద్. ఇప్పటి వరకు గ్లామర్ పాత్రలలో నటించని ఈ చెన్నైముద్దుగుమ్మ ఇప్పుడు గ్లామర్ పాత్రలో నటించడానికి సిద్దమని చెపుతోంది. అంతేకాదు సినిమా అంటేనే ఒక గ్లామర్ ప్రపంచమని దానిలో పాత్ర డిమాండ్ చేస్తే రొమాంటిక్, గ్లామర్ పాత్రలు చేయడానికి తనకు ఎటువంటి అభ్యంతరం లేదని అంటోంది. ఈ మద్య తను నటించిన తమిళ సినిమా ‘ఎదిర్ నీచ్చల్ ‘ మంచి హిట్ ను సాదించడంతో తను చాలా సంతోషంతో వుంది. ఈ సినిమా హిట్ అవడంతో ఆమెకు చాలా సినిమాలలో నటించడానికి అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం తను పలు తమిళ సినిమాలో నటిస్తూ బిజీగా ఉంది.