నేను కాజల్ కు పూర్తిగా విరుద్దం – ఇలియానా

illeyana

ఇలియానా షహీద్ కపూర్ తో కలిసి బాలీవుడ్ లో సెకండ్ సినిమాలో నటిస్తూ బిజీగా వుంది. ఆమె నటించిన మొదటి సినిమా బాలీవుడ్ సినిమా ‘బర్ఫీ’ విమర్శకుల నుండి అలాగే ప్రేక్షకుల నుండి కూడా మంచి ప్రశంసలు అందుకుంది. ఇలియానా ఈ మద్య కాజాల్ కు విరుద్దంగా మాట్లాడం జరిగింది. మేము చెబుతున్నది నటి కాజల్ గురించి కాదు. ఇలియానా తాజాగా నటించిన సినిమాలోని కాజల్ పాత్ర గురించి. ఆమె మాట్లాడుతూ ‘ నేను చాలా ఓపెన్ గా ఉంటాను. నాకు ఎక్కువ మంది ఫ్రెండ్స్ లేరు. నా చిన్ననాటి స్నేహితులే నాకు బెస్ట్ ఫ్రెండ్స్. నాకు జంతువులు అంటే ఇష్టం లేదు. ఇది నేను నటిస్తున్న ‘ఫటా పోస్టర్ నిఖల హీరో’ సినిమాలోని పాత్ర క్యారెక్టర్. ఈ పాత్ర పేరు కాజల్. ఈ కాజల్ పాత్ర నా నిజ జీవితానికి పూర్తి విరుద్దంగా వుంది. ఈ పాత్రలో నటిస్తుంటే నాకు చాలా ఆనందంగా అనిపించింది” అని అంది. అలాగే నాకు టాలీవుడ్ నా మొదటి ఇల్లు. టాలీవుడ్ లో నటించడానికి ఒక మంచి స్క్రీప్ట్ కోసం ఎదురు చూస్తున్నానని అంది.

Exit mobile version