గుర్రపు స్వారి మరియు ఫైట్స్ నేర్చుకుంటున్న అనుష్క

anushka
నాగార్జున సరసన నటించిన సోషియో ఫాంటసీ చిత్రం “డమరుకం” చిత్రానికి వచ్చిన స్పందనతో తో సంతృప్తి చెందినా అనుష్క ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చారిత్రాత్మక చిత్రం “రుద్రమ దేవి” చిత్రంలో నటిస్తున్నారు.మీడియాతో మాట్లాడుతూ అనుష్క ఇలా అన్నారు “రుద్రమ దేవి తెలుగు చరిత్రలో ప్రసిద్ది చెందిన వీర నారి, గుణశేఖర్ ఈ చిత్ర కథను అద్భుతంగా తీర్చిదిద్దారు రుద్రమ దేవి పాత్ర మీద చాలా రీసెర్చ్ చేసినట్టు తెలుస్తుంది” అని అన్నారు. ఈ చిత్రం కోసం ఫైట్స్ మరియు గుర్రపు స్వారీ కూడా నేర్చుకుంటున్నట్టు ఈ నటి వెల్లడించారు. “రుద్రమ దేవి” వచ్చే ఏడాది ఏప్రిల్ లో మొదలు కానుంది. అనుష్క త్వరలో “మిర్చి” చిత్రంలో ప్రభాస్ సరసన కనిపించనుంది.

Exit mobile version