ప్రస్తుతం నేను విభిన్నమైన సినిమాలను ఒప్పుకుంటున్నా

ప్రస్తుతం నేను విభిన్నమైన సినిమాలను ఒప్పుకుంటున్నా

Published on Jul 22, 2012 11:03 AM IST


టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం కొత్త తరహా పాత్రలను ఎంపిక చేసుకుంటున్నాను అని అంటున్నారు. ” నేను సినిమాలు ఎంచుకోవడంలో చాలా మార్పులు వచ్చాయి. ప్రస్తుతం కొత్త రకమైన పాత్రలు ఉన్న కథలనే ఎంచుకుంటున్నాను, ఒక స్టార్ లాగా నేను కథలు ఎంచుకోవడంలేదు. ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది, అందువలన ప్రస్తుతం కొత్త రకమైన పాత్రలను మరియు కథలను ట్రై చేస్తున్నాను” అని మహేష్ బాబు ఒక ప్రముఖ న్యూస్ పేపర్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు.

రెండు రోజుల క్రితమే మహేష్ బాబు ఒక బుజ్జి పాపకి తండ్రయ్యారు మరియు ఇప్పుడు ఆయన చాలా సంతోషంగా ఉన్నారు. ప్రస్తుతం మహేష్ రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు, అందులో సుకుమార్ దర్శకత్వంలో, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు నిర్మిస్తున్న చిత్రం ఒకటి మరియు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో, దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కుతున్న మల్టీస్టారర్ మూవీ ‘సీతమ్మ వాకిట్లో సిరి మల్లె చెట్టు’ చిత్రం రెండవది.

ఇకనుంచి మహేష్ బాబు భవిష్యత్తులో కొత్త రకమైన సినిమాలు చేస్తారా ? ఇలాంటి ప్రశ్న మదిలో ఉన్నవారు ఇప్పుడు మహేష్ చెప్పిన సమాధానంతో అవుననే అంటారు.

తాజా వార్తలు