ఈవారం తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్న తెలుగమ్మాయి

Eesha New Stills (6)

90వ దశకం తరువాత తెలుగు సినిమాలలో తెలుగు హీరోయిన్ల కరువ ఏర్పడింది. ఆ పాత్రను భర్తీ చెయ్యడానికి దేశం నలుమూలల నుండి నటీమణులు వచ్చారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కాస్త మారిందనే చెప్పాలి. నిమ్మదిగా తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీలోకి ప్రవేశిస్తున్నారు

అలంటి అమ్మాయిలలో ఈషా ఒకరు. ఈ అమ్మాయి ‘అంతకుముందు ఆ తరువాత’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయంకానుంది. హైదరాబాద్ లో ఎం.బి.ఏ పూర్తి చేసుకున్న ఈ భామకు మోడలింగ్ రంగంలో కూడా ప్రవేశంవుంది

సాక్షి పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విధంగా తెలిపింది ‘నాకు నటన పరంగా ఎటువంటి అనుభవమూ లేదు, కానీ నాకు మోహన్ కృష్ణ ఇంద్రగంటి, మధుభాల మరియు సుమంత్ అశ్విన్ లు కలిసి షూటింగ్ ఆద్యంతం సహకరించారు. నేను కేవలం రెండు నెలలు మాత్రమే నటనలో మెలుకువలు నేర్చుకున్నాను’

అంతేకాక సినిమా ఇండస్ట్రీ అనేది ఒక చెడ్డ రంగమని చాలామందికి ఒక అపోహ వుంది. కానీ నాకు ఇప్పటివరకూ అటువంటి సంఘటనలు ఏమి ఎదురుకాలేదని తెలిపింది. తన మొదటి సినిమాతోనే ఈ తెలుగు అమ్మాయి మనకు చేరువవ్వాలని ఆశిద్దాం

Exit mobile version