అందాల రాక్షసి ఫేమ్ రాహుల్ రవీంద్రన్ మరోసారి ఇంకో ట్రాయాంగ్యూలర్ లవ్ స్టోరీలో మెరవనున్నాడు. ఈ సినిమా పేరు ‘హైదరాబాద్ లవ్ స్టోరీ’. రాజ్ సత్యా దర్శకుడు. ఎస్.ఎన్ రెడ్డి నిర్మాత. మూడు పాటలు మినహా ఈ సినిమా షూట్ దాదాపు పూర్తికావచ్చింది
ఈ సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ “హైదరాబాద్ లో కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన యధార్ధ ప్రేమకధ ఆధారంగా తెరకెక్కించిన ప్రేమకధా చిత్రం. హ్యాపీ డేస్ తమిళ వర్షన్ లో మెరిసిన రెష్మి మీనన్ మరియు జయ హీరోయిన్స్. సునీల్ కశ్యప్ సంగీత దర్శకుడు” అని తెలిపాడు
అందాల రాక్షసి తరువాత రాహుల్ ‘పెళ్లి పుస్తకం’, ‘నేనేం చిన్నపిల్లనా’ సినిమాలలో నటించినా అవి బాక్స్ ఆఫీస్ దగ్గర పరాజయం పాలయ్యాయి. ఈ సినిమానే కాక రాహుల్ ‘అలా ఇలా’ అనే చిత్రంలో కూడా మెరవనున్నాడు. మరిన్ని వివరాలు త్వరలోనే తెలుపుతారు