పవన్ పిలుపుకు భారీ స్థాయి రెస్పాన్స్.!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు సినిమాల్లోకి మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చారు. కానీ ఈ లాక్ డౌన్ సమయంలో మాత్రం ఇంకా ఇంటికే పరిమితం అయ్యారు. అయితే పవన్ కేవలం హీరోగా మాత్రమే కాకుండా సామాజిక అంశాలపై ఎక్కువగా చర్చిస్తూ స్పందిస్తారు.

అలా తాజాగా భారతీయ సంస్కృతి సనాతన ధర్మాన్ని పరిరక్షించాలని ఇచ్చిన పిలుపు కు భారీ ఎత్తున స్పందన రావడం విశేషం. ఈ పిలుపు మేర దీపారాధన చేయాలని కోరగా అందుకు పవన్ అభిమానులు సహా సినీ ప్రముఖులు కూడా పాల్గొనడం గమనార్హం.

పవన్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “వకీల్ సాబ్” దర్శకుడు శ్రీరామ్ వేణు టీం అలాగే ఇదే చిత్రానికి సంగీతం అందిస్తున్న థమన్, అలాగే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మాతృ మూర్తి సురేఖ గార్లు ఈ దీపారాధన చేసి మన సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవడం మన భాధ్యత అని తెలిపారు. అంతే కాకుండా ఈ అంశానికి సంబంధించిన భారతీయ కల్చర్ మేటర్స్ అనే హాష్ టాగ్ కూడా పెద్ద ఎత్తున ట్రెండ్ అయ్యింది.

Exit mobile version