పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ చిత్రం ‘హరిహర వీరమల్లు’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరో వారం రోజుల్లో థియేటర్లలో విధ్వంసం సృష్టించేందుకు వీరమల్లు రెడీ అవుతున్నాడు. జ్యోతికృష్ణ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో పవన్ పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను స్టన్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు.
ఇక ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఉన్నారు. ప్రముఖ ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ బుక్ మై షోలో ఈ సినిమా కోసం ఆసక్తిగా ఉన్నట్లు ఏకంగా 300,000 మంది ఇంట్రెస్ట్ చూపించారు. ఇలా ఓ హిస్టారికల్ చిత్రంగా రాబోతున్న సినిమా కోసం ఇంతమంది ఎదురు చూస్తుండటం నిజంగా విశేషం.
కాగా ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా బాబీ డియోల్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ఏ.ఎం.రత్నం ప్రొడ్యూస్ చేస్తున్నారు.