మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. మెగా157 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరు సరికొత్త లుక్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇక ఈ సినిమాలో అందాల భామ నయనతార హీరోయిన్‌గా నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి.
అయితే, ఈ చిత్రానికి ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ చిత్ర ఓటీటీ రైట్స్ హాట్ కేక్‌లా మారాయి. ఈ చిత్ర ఓటీటీ రైట్స్‌ను దక్కించుకునేందుకు ఓటీటీ సంస్థలు పోటీ పడుతున్నాయి. అంతేగాక వారు ఈ చిత్ర ఓటీటీ రైట్స్ కోసం కళ్లుచెదిరే రేటును కోట్ చేస్తున్నారట. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ చిత్ర ఓటీటీ రైట్స్ కోసం ఏకంగా రూ.55 కోట్లు కోట్ చేసిందట. దీంతో ఈ చిత్ర ఓటీటీ రైట్స్ దాదాపు రూ.60 కోట్లకు డీల్ క్లోజ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇంకా టైటిల్, టీజర్ లాంటివి ఏమీ వదలకుండానే ఈ చిత్ర ఓటీటీ రైట్స్‌కు ఇంత భారీ డిమాండ్ వస్తుండటం విశేషం. ఇక ఆగస్టు 22న మెగాస్టార్ పుట్టినరోజు కానుకగా ఈ చిత్ర టీజర్‌ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోందట. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సాహు గారపాటి, సుస్మిత కొణిదెల ప్రొడ్యూస్ చేస్తున్నారు.