ఇప్పుడు నెమ్మదిగా ఇండియన్ సినిమా దగ్గర యానిమేషన్ సినిమాలు సిరీస్ లకి మంచి ఆదరణ వస్తుంది. హాట్ స్టార్ లో హను మాన్ సిరీస్ కి బోలెడు మంది ఫ్యాన్స్ ఉన్నారు. అక్కడ నుంచి రీసెంట్ గా మహావతార్ నరసింహ, ఇటీవల నెట్ ఫ్లిక్స్ సిరీస్ కురుక్షేత్ర లకి మంచి రెస్పాన్స్ వచ్చాయి.
అయితే వీటికి మించిన యానిమేషన్ కంటెంట్ రాబోతుంది. అది కూడా ఇండియన్ సినిమా మోస్ట్ లవ్డ్ ఫిక్షనల్ రోల్ బాహుబలి పై వస్తున్న సిరీస్. దర్శకుడు రాజమౌళి దీనిపై ఆల్రెడీ క్లారిటీ ఇచ్చారు కానీ తాజాగా థియేటర్స్ లో ఈ సిరీస్ ఫస్ట్ పార్ట్ బాహుబలి ది ఎటర్నల్ వార్ తాలూకా యానిమేషన్ టీజర్ చూసి ఆడియెన్స్ షాక్ అవుతున్నారు.
బాహుబలి ప్రపంచం సరికొత్తగా చూపించి ఊహించని యాక్షన్ ఎలిమెంట్స్ తో నింపడంతో ఎగ్జైట్మెంట్ మరింత ఎక్కువ అయ్యింది. ఇక ఈ ప్రాజెక్ట్ కి ఏకంగా 120 కోట్ల బడ్జెట్ కేటాయించగా ఆ ఖర్చు అంతా ఇందులో కనిపిస్తుంది. ఇక ఈ యానిమేషన్ వెర్షన్ వచ్చాక రచ్చ ఎలా ఉంటుందో చూడాల్సిందే.
