‘కింగ్డమ్’ నుంచి రొమాంటిక్ మెలోడీగా ‘హృదయం లోపల’ సాంగ్ రిలీజ్!

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న చిత్రాల్లో విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కింగ్డమ్ కూడా ఒకటి. ఈ సినిమాను దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తుండగా పూర్తి రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ మూవీ రానుంది. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేశాయి.

అయితే, తాజాగా ఈ మూవీ నుంచి ‘హృదయం లోపల’ అంటూ సాగే రొమాంటిక్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ ఆద్యంతం మెలోడి కంపోజిషన్‌తో అనిరుధ్ తనదైన బీట్స్ అందించి ఆసక్తికరంగా మలిచాడు. ఇక ఈ పాటను ఆయనతో పాటు అనుమిత నాదేశన్ ఆలపించారు. ఈ పాటలో విజయ్‌తో పాటు అందాల భామ భాగ్యశ్రీ బొర్సె కూడా సాలిడ్‌గా కనిపించింది.

ఈ సినిమాను వేసవి కానుకగా మే 30న పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version