టాలీవుడ్ లో రాజమౌళికి కి ఉన్న బ్రాండ్ ఇమేజ్ రీత్యా ఎంతటి స్టార్ అయినా ఆయన సినిమా అంటే ఒకే అనే పరిస్థితి. కథేమిటి, కథనం ఏమిటీ అనే సాహసం కూడా చేయరు. రాజమౌళితో సినిమా అంటే ఆ హీరో తన పేరిట కొన్ని బెస్ట్ రికార్డ్స్ నమోదు చేసుకోబోతున్నాడని ఫిక్స్ అయిపోతారు. మహేష్ కూడా ఇందుకు అతీతుడు కాదని అర్థం అవుతుంది. మహేష్ తో మూవీ చేస్తున్నట్లు కొద్దిరోజుల క్రితం రాజమౌళి ప్రకటించారు. కె ఎల్ నారాయణ నిర్మాతగా ఈ మూవీ తెరకెక్కనుందని ఆయన చెప్పడం జరిగింది.
ఐతే ఇందులో ట్విస్ట్ ఏమిటీ అంటే…మహేష్ తో సినిమా అనుకున్నాను కానీ ఇంకా కథ నిర్ణయించలేదు అన్నారు. పూర్తి స్క్రిప్ట్ చదవనిదే సినిమా ఒకే చేయని మహేష్ కథ కూడా తెలియకుండా సినిమా ఎలా ఫైనల్ చేశారు అనేది ఆసక్తికరం. దర్శకుడు రాజమౌళి కాబట్టి ఆయన కాంప్రమైజ్ అయ్యారా అనే సందేహం కలుగుతుంది. ఎందుకంటే తాజాగా ఆయన వంశీ పైడిపల్లితో మూవీ స్క్రిప్ట్ నచ్చని కారణంగా రిజెక్ట్ చేశారు. మరి రాజమౌళి ప్రిపేర్ చేసిన స్క్రిప్ట్ నచ్చకపోతే వంశీ పైడిపల్లిలా రిజెక్ట్ చేస్తాడా లేక రాజమౌళి కాబట్టి సినిమా చేస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది.