హర్రర్ కామెడీ “గార్డ్” ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో!

Guard Now Streaming on Amazon Prime

విరాజ్ రెడ్డి, మీమీ లియోనార్డ్, శిల్ప బాలకృష్ణన్ ప్రధాన పాత్రల్లో నటించిన “గార్డ్” సినిమాను జగ్గా పెద్ది దర్శకత్వంలో అనసూయ రెడ్డి నిర్మించారు. ఫిబ్రవరి 28న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలైన ఈ చిత్రం, ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌కి అందుబాటులో ఉంది.

ఈ సినిమాలో హీరో గార్డుగా పనిచేస్తూ ఎదుర్కొన్న అనూహ్యమైన పరిస్థితులు, వాటిని అతను ఎలా అధిగమించాడన్నదే కథా సారాంశం. హాలీవుడ్ ఆర్టిస్టులు, టెక్నీషియన్లు కూడా ఈ చిత్రంలో భాగమయ్యారు. మొత్తం షూటింగ్ ఆస్ట్రేలియాలో జరిగింది, అందుకే విజువల్స్ కూడా కొత్తగా కనిపిస్తాయి.

ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం, త్వరలో మరికొన్ని ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లలో కూడా విడుదల కానుంది.

Exit mobile version