యంగ్ హీరో తేజ సజ్జా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘మిరాయ్’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ‘హను-మాన్’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత తేజ సజ్జా నటిస్తున్న ఈ సినిమా సూపర్ యోధ చిత్రంగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతుంది. ఇక ఈ సినిమాను దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేస్తుండగా ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఈ సినిమాపై అంచనాలు పెంచేసింది.
ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 12న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే వెల్లడించారు. అయితే, ఈ చిత్రాన్ని పలు భాషల్లో గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు. కాగా, ఈ చిత్రాన్ని కన్నడలో రిలీజ్ చేసేందుకు ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ముందుకు వచ్చింది. వికె ఫిల్మ్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని కన్నడలో రిలీజ్ చేయనున్నట్లు హోంబలే పిల్మ్స్ అధికారికంగా ప్రకటించారు.
దీంతో ఈ సినిమాకు కన్నడలోనూ సాలిడ్ క్రేజ్ దక్కనుంది. ఇక ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను ఆగస్టు 28న రిలీజ్ చేయనున్నారు. దీంతో ఈ ట్రైలర్ ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. ఈ సినిమాలో రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తుండగా మంచు మనోజ్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టిజి.విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.