కరోనా సోకిన హాలీవుడ్ హీరో సేఫ్

కరోనా సోకిన హాలీవుడ్ హీరో సేఫ్

Published on Mar 17, 2020 12:30 PM IST

హాలీవుడ్ సీనియర్ హీరో టామ్ హాంక్స్ అతని భార్య కరోనా వైరస్ బారినపడ్డారు. ఇటీవల టామ్ హాంక్స్ తన భార్యతో కలిసి ఆస్ట్రేలియా టూర్ వెళ్లారు. ఆ సంధర్భంలో వీరికి కరోనా వైరస్ సోకినట్లు తెలుస్తుంది. వైద్య పరీక్షల అనంతరం వీరిని ఐసొలేషన్ వార్డుకి తరలించి ప్రత్యేక చికిత్స అందించారు. కాగా ఈ జంట కరోనా వైరస్ నుండి పూర్తిగా కోలుకొని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు.

టామ్ హాంక్స్ అనేక గొప్ప హాలీవుడ్ చిత్రాలలో నటించారు. ఆయన నటించిన బెస్ట్ మూవీస్ లో ఒకటైన ఫారెస్ట్ గంప్ హిందీలో రీమేక్ అవుతుంది. బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా పేరుతో ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు.

తాజా వార్తలు