న్యాచురల్ స్టార్ నాని హీరోగా శైలేష్ కొలను తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్టైనర్ హిట్ 3. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ రన్ కొనసాగిస్తుంది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి సాలిడ్ రెస్పాన్స్ దక్కింది. దీంతో, ఈ సినిమా అన్ని ఏరియాల్లో అదిరిపోయే ఓపెనింగ్స్ సాధించింది. ‘హిట్ 3’ 3వ రోజు కూడా నైజాంలో రూ. 2.29 కోట్ల షేర్‌ను రాబట్టడం విశేషం. మొత్తానికి జీఎస్టీ మినహా మొత్తం రూ.8.79 కోట్లను కలెక్ట్ చేసింది. మొదటి రోజు రూ.4.27 కోట్లు & రెండవ రోజు రూ.2.23 కోట్లను ‘హిట్ 3’ కలెక్ట్ చేసింది.
ఇక ఈ సినిమాలో నాని పవర్ఫుల్ పర్ఫార్మెన్స్కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా అర్జున్ సర్కారుగా తన పాత్రలో నాని అద్భుతంగా నటించాడు. కీలక సన్నివేశాల్లో నాని అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్. శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందించాడు. ఈ సినిమాను దర్శకుడు శైలేష్ కొలను డైరెక్ట్ చేయగా వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ ప్రొడ్యూస్ చేసింది. మొత్తమ్మీద ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది.