నాచురల్ స్టార్ నాని హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన అవైటెడ్ సాలిడ్ చిత్రం “హిట్ 3” కోసం అందరికీ తెలిసిందే. అయితే గట్టి అంచనాలు నడుమ వచ్చిన ఈ చిత్రం నాని కెరీర్లోనే కాకుండా మన మిడ్ రేంజ్ హీరోస్ అందరిలో కూడా ఒక రికార్డు బ్రేకింగ్ ఓపెనింగ్స్ ని సాధించి అదరగొట్టింది.
ఇలా బుకింగ్స్ పరంగా కూడా సాలిడ్ నంబర్స్ అందుకుంటున్న ఈ చిత్రం గత 24 గంటల్లో 2 లక్షల కంటే ఎక్కువ టికెట్స్ ని వరుసగా బుక్ చేసుకుంటూ నిలకడగా కొనసాగుతుంది. ఇలా మొత్తానికి అర్జున్ సర్కార్ మ్యానియా మాత్రం ఇపుడు మామూలు లెవెల్లో లేదని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందించగా వాల్ పోస్టర్ సినిమా అలాగే యూనానిమస్ ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహించారు.