ప్రభాస్ సినిమా కోసం భారీ ధర చెల్లించడానికి రెడీగా ఉన్న డిస్ట్రిబ్యూటర్లు

ప్రభాస్ సినిమా కోసం భారీ ధర చెల్లించడానికి రెడీగా ఉన్న డిస్ట్రిబ్యూటర్లు

Published on Mar 3, 2020 9:47 AM IST

‘బాహుబలి, సాహో’ చిత్రాలతో ఉత్తరాదిన ప్రభాస్ క్రేజ్ అమాంతం పెరిగింది. ఈ చిత్రాలు తెలుగు రాష్ట్రాలతో సమానంగా హిందీలో వసూళ్లను రాబట్టాయి. ‘సాహో’చిత్రమైతే తెలుగులో నిరుత్సాహపరిచినా హిందీలో మాత్రం లాభాల్ని అర్జించింది. దీంతో హిందీ ప్రేక్షకుల్లో ప్రభాస్ క్రేజ్ ఏమిటో స్పష్టమైంది. అందుకే ప్రభాస్ తర్వాతి చిత్రం ‘జాన్’ కోసం అక్కడి డిస్ట్రిబ్యూటర్లు పెద్ద ఎత్తున పోటీపడుతున్నారు.

‘బాహుబలి 2, సాహో’ చిత్రాలకు చెల్లించిన రూ.50, రూ.70 కోట్లకు మించి ధరను చెల్లించడానికి పోటీపడుతున్నారు. ఈ పోటీ చూస్తుంటే రైట్స్ ఆల్ టైమ్ రికార్డ్ ధరకు అమ్ముడవడం ఖాయమని అనిపిస్తోంది. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ రొమాంటిక్ ఎంటెర్టైనర్లో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు