బుట్ట బొమ్మ పాటకు స్టెప్పులేసిన అలనాటి బుట్ట బొమ్మ..!

అలవైకుంఠపురంలోని బుట్ట బొమ్మ సాంగ్ మానియా ఆగడం లేదు. ఇప్పటికే ఈ పాట పలు రికార్డులు సొంతం చేసుకోగా, బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ఈ సాంగ్‌కు స్టెప్పులేసిన సంగతి తెలిసిందే. అయితే ఇటు టాలీవుడ్, బాలీవుడ్‌లోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా ఈ పాట మార్మోగుతుంది.

ఆసిస్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ తన భార్యతో కలిసి బొట్ట బొమ్మ సాంగ్‌కు స్టెప్పులేసిన టిక్‌టాక్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. అయితే తాజాగా ఈ పాటకు అలనాటి బుట్ట బొమ్మ హీరోయిన్ సిమ్రాన్ కూడా స్టెప్పులేసి అదరగొట్టింది. అయితే ఈ వీడియోతో పాటు డ్యాన్స్ ఎల్లప్పుడూ నన్ను నిలబెడుతుంది అంటూ ఓ ట్యాగ్ లైన్ కూడా పెట్టింది. అయితే ప్రస్తుతం ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Exit mobile version