ఎన్టీఆర్ ఆ బాధ్యత తీసుకోవాలి

ఎన్టీఆర్ ఆ బాధ్యత తీసుకోవాలి

Published on Jul 18, 2020 7:09 PM IST

హీరోయిన్ పాయల్ ఘోష్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి సోషల్ మీడియా వేదికగా ఓ విజ్ఞప్తి చేశారు. ఆమె ఎన్టీఆర్ ఓ సామాజిక బాధ్యత నెరవేర్చాలని కోరడం జరిగింది. దేశంలో అనేక మంది అవయవాల కొరతతో మరణిస్తున్నారు. మరణించిన వారి అవయవాలు దానం చేయడం ద్వారా కొందరు రోగులకు, ప్రమాదాల బారిన పడిన వారికి ప్రాణ దానం చేయవచ్చు. అందుకే అందరూ సామాజిక బాధ్యతగా అవయవ దానానికి ముందుకు రావలని ఆమె కోరారు.

అలాగే ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లాలని, ఈ విషయంలో ఆయన అనేక మందిలో స్ఫూర్తి నివ్వాలని కోరారు. మరి పాయల్ ఘోష్ రిక్వెస్ట్ ఎంత వరకు ఎన్టీఆర్ పరిగణలోకి తీసుకుంటారో చూడాలి. పాయల్ ఘోష్ ఎన్టీఆర్ ఊసరవెల్లి సినిమాలో కీలక రోల్ చేసింది.

తాజా వార్తలు