ఏ హీరోని బాధ పెట్టేలా ఉండవు : అల్లరి నరేష్

ఏ హీరోని బాధ పెట్టేలా ఉండవు : అల్లరి నరేష్

Published on Aug 24, 2012 12:11 PM IST


కామెడీ కింగ్ అల్లరి నరేష్ హీరోగా టాలీవుడ్ లోని సుమారు 100 సినిమాల్లోని సన్నివేశాలను తీసుకొని పేరడీ చేస్తూ తెరకెక్కిన చిత్రం ‘సుడిగాడు’. మంచి అంచనాల నడుమ ఆంద్రప్రదేశ్ అంతటా ఈ రోజు ఈ చిత్రం విడుదలవుతోంది. ‘సుడిగాడు’ చిత్రంలో చేసిన పేరడీ సన్నివేశాలు రియల్ గా ఆ సీన్స్ చేసిన హీరోల మనసును బాధ పెట్టావా అని అడిగిన ప్రశ్నకు నరేష్ సమాధానమిస్తూ ‘ అలా అని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే పేరడీ సన్నివేశాలను రాసుకునేటప్పుడే ఎన్నో జాగ్రత్తలు తీసుకొని మొత్తం కామెడీగా ఉండేలా చూసుకున్నాం. మేము ఎవరినీ భాద పెట్టాలని ఈ సినిమా తీయలేదు అది మన హీరోలకి కూడా తెలుసు. ఇప్పటికే నేను చేసిన పేరడీ సన్నివేశాలు చూసి ఎంతో హాయిగా నవ్వుకునేలా ఉన్నాయని చాలా మంది హీరోలు నాకు తెలియజేశారని’ ఆయన అన్నారు.

మీరు భవిష్యత్తులో ఎలాంటి సినిమాలు చేయాలుకుంటున్నారు అని అడిగిన ప్రశ్నకు నరేష్ సమాధానమిస్తూ ‘ది వరల్డ్ గ్రేటెస్ట్ కమెడియన్ చార్లీ చాప్లిన్ గారు చేసిన సినిమాల్లాంటివి చేయాలని ఉందని’ ఆయన అన్నారు. భీమనేని శ్రీనివాస్ రావు దర్శకత్వం వహించిన ‘సుడిగాడు’ చిత్రంలో మోనాల్ గజ్జర్ కథానాయికగా నటించారు.

తాజా వార్తలు