మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమానే మాస్ జాతర. దర్శకుడు భాను భోగవరపు తెరకెక్కించిన ఈ సినిమా ఇటీవల ట్రైలర్ తో మంచి స్పందన అందుకుంది. ఇక నిన్ననే గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరుపుకున్న ఈ సినిమా కోసం తమిళ స్టార్ నటుడు సూర్య ముఖ్య అతిథిగా రావడం జరిగింది.
అయితే సూర్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసాడు. తను కూడా రవితేజకి ఫ్యాన్ అంటూ చెప్పడం చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. ఒక ఫ్యాన్ బాయ్ గా ఈ ఈవెంట్ కి వచ్చానని, తమ ఇంట్లో ఎప్పుడైనా రవితేజ పేరు చెప్తే తన కుటుంబం జ్యోతిక, కార్తీ లలో ఒకరకమైన ఆనందకర వాతావరణం వస్తుందని సూర్య తెలిపారు.
అలాగే తానొక ఫ్యాన్ బాయ్ ని అని ఒక విస్ఫోటనానికి మనిషి రూపం ఉంటే ఎలా ఉంటుందో అది రవితేజ గారిలా ఉంటుంది అని సూర్య చెప్పడం క్రేజీగా మారింది. దీనితో రవితేజ లిస్ట్ లో మరో స్టార్ యాడ్ అయ్యారని చెప్పాలి.
