ధనలక్ష్మి బాదర్ల నిర్మిస్తున్న ‘వసుదేవసుతం’ చిత్రం టీజర్‌ను తాజాగా హీరో సత్య దేవ్ విడుదల చేశారు. మాస్టర్ మహేంద్రన్ హీరోగా, వైకుంఠ్ బోను దర్శకత్వంలో రెయిన్‌బో సినిమాస్ బ్యానర్‌పై ఈ చిత్రం రూపొందుతోంది.
టీజర్ “ధర్మ హింస తథైవచ” అనే పవర్ ఫుల్ డైలాగ్‌తో ప్రారంభమై ఆకట్టుకుంది. ఇందులో గుప్త నిధి, యాక్షన్ సన్నివేశాలు, హీరో-హీరోయిన్ల మధ్య ట్రాక్‌ను చూపించారు. ప్రత్యేకించి, చివరిలో కత్తితో నరికే దృశ్యం హైలైట్‌గా నిలిచింది.
మణిశర్మ అందించిన నేపథ్య సంగీతం (BGM) మరియు జిజ్జు సన్నీ సినిమాటోగ్రఫీ సినిమాకు మరింత గ్రాండ్‌నెస్ తీసుకొచ్చాయి. ఈ టీజర్ చూస్తుంటే సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. త్వరలో సినిమా విడుదల తేదీని ప్రకటిస్తామని చిత్ర బృందం తెలిపింది.


