రవితేజ – రమేష్ వర్మ సినిమా డిటైల్స్ !

మాస్ మహా రాజా రవితేజ ప్రస్తుతం ‘క్రాక్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత రవితేజ డేట్స్ కోసం త్రినాధ్ రావ్, రమేష్ వర్మ ఎదురు చూస్తున్నారు. రమేష్ వర్మ సినిమా అయితే రెండు మూడు నెల్లల్లో పూర్తి అవుతుంది. అందుకే రమేష్ వర్మ సినిమానే ముందు చేస్తాడట. ఇక ఈ సినిమాలో రవితేజ డబల్ యాక్షన్ అని, అందుకే ఇద్దరు హీరోయిన్స్ నటించనున్నారని తెలుస్తోంది.

కాగా ఇప్పటికే ఒక హీరోయిన్ గా నిధి అగర్వాల్ ను ఫైనల్ చేసిన చిత్రబృందం, మరో హీరోయిన్ గా లావణ్య త్రిపాఠిను తీసుకోవాలనుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రాన్ని కోనేరు సత్యనారాయణ నిర్మించనున్నారు. ఇకపోతే ప్రస్తుతం రవితేజ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తోన్న ‘క్రాక్’ సినిమా రవితేజకు పూర్వవైభవాన్ని తీసుకొస్తోందట.

ఈ చిత్రాన్ని కరోనా తగ్గాక విడుదల చేయాలనుకుంటున్నారు. ఏమైనా రవితేజ ‘డిస్కో రాజా’తో ఆశించిన స్థాయిలో హిట్ అందుకోలేకపోయాడు. మరి క్రాక్ సినిమాతోనైనా అందుకుంటాడేమో చూడాలి.

Exit mobile version