లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ మొదటి నుండి లో ప్రొఫైల్ నే మెయింటైన్ చేస్తూ రావడంతో.. ఆయనకంటే ప్రతిభలో అనుభవంలో తక్కువ ఉన్న వ్యక్తులు కూడా ఇండియన్ క్రికెట్ లో కీలక పాత్రలు దక్కించుకున్నారు. కానీ కపిల్ దేవ్ లాంటి గ్రేట్ టీమ్ లీడర్ మాత్రం రిటైట్ అయ్యాక మళ్లీ లైమ్ లైట్ లో రాకుండా ఉండిపోయారు. అయితే ఆయన జీవితాన్ని వెండితెర పై అన్నా చూసుకుని సంతోష పడదామని ఆయన అభిమానులు ఎంతగానో ఆశగా ఎదురుచూస్తున్న సమయంలో కరోనా వచ్చి కపిల్ బయోపిక్ విడుదలను ఆపేసింది. అయితే తాజాగా బాలీవుడ్ సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాని సంక్రాంతికి నేరుగా థియేటర్లల్లో రిలీజ్ సన్నాహాలు చేస్తున్నారు.
సినిమాలోని అద్భుతమైన ఫీల్ అండ్ 80 నాటి కాలం సంగతులను పరిస్థితులను ప్రేక్షకులు ఇంకా బాగా ఓన్ చేసుకోవాలంటే థియేటర్ ఫీల్ ఉండాలి. అందుకే నేరుగా థియేటర్స్ లోనే తమ సినిమా రిలీజ్ చేయాలని మేకర్స్ తమకు వచ్చిన ఓటీటీ ఆఫర్స్ ను కూడా రిజెక్ట్ చేశారు. బాలీవుడ్ స్టార్ రణ్ వీర్ సింగ్ హీరోగా కబీర్ ఖాన్ దర్శకత్వంలో రానున్న ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని యావత్తు క్రికెట్ ప్రేమికులు వెయిట్ చేస్తున్నారు. ఇక బయోపిక్ ల స్పెషల్ ప్రొడ్యూసర్ విష్ణు ఇందూరి నిర్మిస్తున్న ఈ బయోపిక్ తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో కింగ్ అక్కినేని నాగార్జున చేతుల మీదుగా తెలుగులో విడుదల కానుంది.