యంగ్ హీరో నవీన్ చంద్ర, గాయత్రీ సురేష్ హీరో హీరోయిన్లుగా జి. కార్తీక్ రెడ్డి దర్శకత్వంలో నిర్మాత భార్గవ్ మన్నె నిర్మిస్తున్న చిత్రం “హీరో హీరోయిన్”. కాగా ఈ సినిమాను ఫిబ్రవరి 7న రిలీజ్ చేయాలని అనుకున్నప్పటికీ తాజాగా చిత్రబృందం తమ సినిమా రిలీజ్ డేట్ ను మార్చుకుంది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 15 గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.
అయితే తాజాగా ఈ చిత్రం నుండి పర్వట్ అనే సాంగ్ ను కూడా విడుదల చేశారు. అమ్మాయిలను టీజ్ చేస్తూ సాగే ఈ సాంగ్ జస్ట్ ఒకే అనిపిస్తోంది. అయితే అనూప్ సంగీతం, పూర్ణ చారి సాహిత్యం మాత్రం బాగుంది. పైరేటెడ్ లవ్ స్టోరీగా ఈ సినిమాను తెరకెక్కించాడట దర్శకుడు కార్తీక్. రీసెంట్ గా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా నవీన్ చంద్రకు ఎలాంటి హిట్ ఇస్తోందో చూడాలి.