మా చిత్రంలో హీరొయిన్ ఏడ్చినా ప్రేక్షకుడు నవ్వుతాడు!!


శివాజీ, అదితి అగర్వాల్ మరియు రచనా మౌర్య లు ప్రధాన పాత్రలలో ఒక చిత్రం తెరకెక్కుతుంది. “ఏం బాబు లడ్డు కావాలా?” అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్ర బృందం హైదరాబాద్ లో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసింది . ఈ సమావేశంలో హీరో శివాజీ చిత్ర విశేషాలను చెబుతూ “నేను,రచయిత భాస్కర్ భట్ల మరియు సంగీత దర్శకురాలు ఎమ్ ఎమ్ శ్రీలేఖ కలిసిపని చేసిన అన్ని చిత్రాలు విజయం సాదించినవే ఈ చిత్రం కూడా తప్పకుండా విజయం సాదిస్తుంది” అని అన్నారు. దర్శకుడు ఈ చిత్రం గురించి మాట్లాడుతూ “హాస్యాన్నే నమ్ముకొని తీసిన సినిమా ఇది ఈ చిత్రంలో హీరొయిన్ ఏడ్చినా ప్రేక్షకుడు నవ్వుతాడు అంతలా నవ్వించే సన్నివేశాలు ఈ చిత్రంలో ఉంటాయి” అని అన్నారు. గాంధి మనోహర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని టి జనార్ధన్ నిర్మించారు. ఈ చిత్రానికి ఎమ్ ఎమ్ శ్రీలేఖ సంగీతం అందించగా బి వాసు సినిమాటోగ్రఫీ అందించారు. ఈ ఏడాదే ఈ చిత్రం విడుదల కానుంది.

Exit mobile version