మిహీక బజాజ్ ఒక యంగ్ బిజినెస్ లేడీ. డ్యూ డ్రాప్ డిజైన్ స్టూడియో పేరుతో ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ మరియు డెకరేషన్ సంస్థలను నడుపుతుంది. ఆర్కిటెక్చర్ పై ఉన్న మక్కువతో అటు వైపు అడుగులు వేసింది. ఇంటీరియర్ డిజైన్ ఆర్కిటెక్చర్ పై ఆకర్షణతో ముంబైలోని రచన సన్సాద్ అనే విద్యా సంస్థ నుండి ఇంటీరియర్ డిజైన్ లో డిప్లొమా చేసింది. లండన్ లోని చెల్సియా యూనివర్సిటీ నుండి ఎమ్ ఏ డిగ్రీ ఆర్ట్ మరియు డిజైన్ విభాగంలో డిగ్రీ పొందింది మిహీక బజాజ్. పిక్సీ డస్ట్ పేరుతో ఓ బ్లాగ్ ఆమెకు ఉండగా, అందులో ఆర్టికల్స్ రాస్తూ ఉంటుంది.
మిహీక బజాజ్ తల్లిదండ్రులు హైదరాబాద్ లోనే నివాసం ఉంటారు. తల్లి బంటీ బజాజ్ కాగా తండ్రి సురేష్ బజాజ్. వీరికి హైదరాబాద్ లో క్రాసల అనే ఓ జ్యువలరీ బ్రాండ్ ఉంది. తల్లి బంటీ బజాజ్ జే ఎన్ టి యూ యూనివర్సిటీ హైదరాబాద్ లో చదువుకున్నారు. ఆమె వృత్తి రీత్యా జ్యువలరీ డిజైనర్. ఇక ఈమెకు సామ్రాట్ అనే బ్రదర్ ఉన్నారు. ఆయన క్రాసల జ్యువలరీ బ్రాండ్ మానేజ్మెంట్ చూసుకుంటున్నారు.