ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా “వకీల్ సాబ్” అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాలు నెలకొల్పుకున్న షూటింగ్ నిమిత్తం పవన్ కళ్యాణ్ ఇప్పుడు మరోసారి లాయర్ సూట్ ధరించారు. అయితే ఇటీవలే షూట్ మొదలు పెట్టిన పవన్ నుంచి లేటెస్ట్ లుక్స్ బయటకు వచ్చాయి. అలాగే ఇప్పుడు తన చిత్ర యూనిట్ మరియు నిర్మాత దిల్ రాజుతో కలిసి హైదరాబాద్ మెట్రో వద్ద దర్శనమిచ్చి ప్రయాణం కూడా చేసారు.
అయితే పవన్ షూటింగ్ నిమిత్తమే వెళ్లారని అందరికీ తెలిసిందే. కానీ ఆ ప్రయాణంలో ఏం జరిగిందో అసలు మ్యాటర్ ఇప్పుడు మీడియాకు వచ్చింది. మాదాపూర్ నుంచి మియాపూర్ మెట్రో ప్రయాణానికి గాను పవన్ సినీ హీరోలా కాకుండా జనసేన అధినేతగా సాధారణ ప్రయాణికునిలానే చెకింగ్ ప్రక్రియ సహా అన్ని పనులతోనే ప్రారంభించారు.
అయితే మియాపూర్ ట్రైన్ లో పవన్ తో ద్రాక్షారామం మరియు సత్యవాడ ప్రాంతానికి చెందిన రైతులు కూర్చోగా వారితో పవన్ సంభాషించారు. వారిలో ద్రాక్షారామంకు చెందిన రైతు సత్యనారాయణతో పంట గురించి అలాగే ప్రస్తుత సమస్యల కోసం అడిగి తెలుసుకున్నారు. దీనితో పవన్ కు ఆ రైతు ఇటీవలే వర్షాల వల్ల వ్యవసాయం బాగా దెబ్బతింది అని మా కుటుంబలో కూడా మీకు చాల మంది అభిమానులు ఉన్నారని..
మిమ్మల్ని కలవడం మరింత సంతోషంగా ఉందని అన్నారు. అలాగే తనకు హైదరాబాద్ మెట్రో ప్రయాణం మొదటి సారి అని చెప్పగా అందుకు పవన్ తనకి కూడా మెట్రో ప్రయాణం మొదటిసారే అని తనదైన శైలి చెప్పి నవ్వించారు. ఇలా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గా మొదలు పెట్టిన ఈ ప్రయాణం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గా పవన్ ముగించారు.