హీరో రామ్ తన పుట్టిన రోజు కానుకగా ఓ స్పెషల్ వీడియోతో వచ్చేశాడు. నిన్న ప్రకటించిన విధంగా తన లేటెస్ట్ మూవీ రెడ్ నుండి ‘డిన్చక్…’ అనే సాంగ్ టీజర్ ని విడుదల చేశారు. దాదాపు నిమిషం నిడివి ఉన్న ఈ సాంగ్ టీజర్ లో రామ్ మాస్ ఎనర్జీ స్టెప్స్ తో దుమ్ము రేపాడు. లైట్ హెయిర్, గుబురు గడ్డంలో పాటకు తగ్గట్టు ఆయన మాస్ లుక్ కేకగా ఉంది. ఇక మొదటిసారి ఐటెం సాంగ్ చేస్తున్న హెబ్బా పటేల్ హాట్ హాట్ డ్రెస్సులలో గ్లామర్ వలకబోసింది.
మణిశర్మ మాంచి ఐటెం బీట్ అందించగా సింగర్స్ సాకేత్, కీర్తన శర్మ సూపర్ గా పాడారు. ఇక ఈ సాంగ్ కి సాహిత్యం కాసర్ల శ్యామ్ అందించాడు. ఈ సాంగ్ పూర్తి వీడియో త్వరలో రానుంది. ఇక తమిళ హిట్ మూవీ తాడం కి తెలుగు రీమేక్ గా వస్తున్న ఈ చిత్రంలో రామ్ డ్యూయల్ రోల్ చేస్తుండగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతుంది. నిర్మాత స్రవంతి రవి కిషోర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
వీడియో కొరకు ఇక్కడ క్లిక్ చేయండి