రెబల్ ఆడియో ఫంక్షన్ పాస్ లకు ఫుల్ డిమాండ్


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘రెబల్’ చిత్ర ఆడియో వేడుక రేపు జరగనుంది. ఈ కార్యక్రమానికి సంబందించిన పాస్ లకు ఫుల్ డిమాండ్ నెలకొంది. ఈ చిత్ర ఫస్ట్ లుక్ వల్ల ఈ చిత్రంపై అంచనాలు పెరిగిపోయాయి మరియు ఈ చిత్ర నిర్మాతలకు మంచి బుజినెస్ జరిగింది. అభిమానులు మరియు మీడియా వారికి ఈ చిత్ర ఆడియో వేడుక పాస్ లు దొరకడం లేదని మేము విన్నాము.

రేపు హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో జరగనున్న ఈ ఆడియో విడుదల వేడుకకి సినీ ప్రముఖులు రానున్నారు. ప్రభాస్ సరసన మిల్క్ బ్యూటీ తమన్నా మరియు దీక్షా సేథ్ కథానాయికలుగా నటించారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సంగీతం కూడా ఆయనే అందించారు. జె. భగవాన్ మరియు జె. పుల్లారావు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 28 ప్రేక్షకుల ముందుకు రానుంది.

Exit mobile version