యంగ్ హీరో నితిన్ – పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రానున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘హార్ట్ అటాక్’. ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ని ఈ నెల 27న రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది, మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఈ స్టైలిష్ మూవీ 2014 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమవుతోంది.
రెండు హిట్స్ అందుకొని ఫుల్ ఫాంలో ఉన్న నితిన్ ఈ సినిమాలో చాలా స్టైలిష్ గా కనిపించబోతున్నాడు. ఆద శర్మ హీరోయిన్ గా కనిపించనున్న ఈ మూవీకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. పూరి జగన్నాథ్ ఈ మూవీని పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. ఎస్ఆర్ శేఖర్ ఎడిటర్ గా పనిచేస్తున్న ఈ సినిమాకి అమోల్ రాథోడ్ సినిమాటోగ్రాఫర్. పూరి ఎప్పుడు ఆసక్తికరమైన టీజర్స్ రిలీజ్ చేస్తుంటాడు, కావున ఈ సరి ఎలాంటి టీజర్ తో ఆకట్టుకుంటాడో చూడాలి..