తెలుగు సినిమా బృందానికి బ్యాంకాక్ లో షూటింగ్ స్వర్గధామం. ఇప్పుడు ఆ దేశం ఆడియో విడుదలకు కూడా ప్రముఖ ప్రదేశంగా మారింది. ‘ఏమో గుర్రం ఎగరావచ్చు’ సినిమా తరువాత ‘హార్ట్ ఎటాక్’ ఆడియో అక్కడ విడుదలచెయ్యనున్నారు.
నితిన్ ట్విటర్ ద్వారా రేపు బ్యాంకాక్ లో ఆడియో లంచ్ వుంటుంది అని, ఆలీ నచిమి స్టయిల్ లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తాడని, ఫోటోలను పోస్ట్ చేస్తానని తెలిపాడు. అనూప్ రూబెన్స్ సంగీత దర్శకుడు.
ఈ సినిమా జనవరి 31న విడుదలకానుంది. నితిన్ సరసన ఆదా శర్మ నటించింది. పూరీ జగన్నాధ్ దర్శకనిర్మాత.