‘ఎన్టీఆర్ – హృతిక్ రోషన్’ కలయికలో రాబోతున్న మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా మల్టీస్టారర్ ‘వార్ 2’. ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ హైప్ ఉంది. ఐతే, ఇప్పుడు ఎక్స్ లో హీరోల మధ్య హ్యాష్‌ట్యాగ్ యుద్ధం ప్రేక్షకుల్ని మరింత ఉత్కంఠకు గురిచేస్తోంది. హృతిక్ రోషన్ తన ట్విట్టర్‌లో ‘మళ్లీ యుద్ధ రేఖలు పడ్డాయి. హ్యాష్ ట్యాగ్ అన్నింటికంటే ముందే చెబుతోంది! ప్రతి అప్ డేట్, ప్రతి సీక్రెట్ కోసం #HrithikvsNTR హ్యాష్ ట్యాగ్ ను ఫాలో అవ్వండి. ఇక్కడ నుంచే యాక్షన్ మొదలవుతోంది!” అంటూ ఎన్టీఆర్‌ను ట్యాగ్ చేస్తూ హృతిక్ పోస్ట్ పెట్టాడు.
హృతిక్ పోస్ట్ చూసిన ఎన్టీఆర్ రీపోస్ట్ చేస్తూ.. ‘#War2 అప్‌డేట్స్ కావాలా, స్పెషల్ విషయాలు తెలుసుకోవాలా ? హే హృతిక్ సర్, మనిద్దరం ఈ విషయంలో మాట్లాడుకున్నాం! ఇకమీదట ఒకే ఒక్క హ్యాష్‌ట్యాగ్: #NTRvsHrithik. అందరూ వెయిట్ చేయండి, ఎందుకంటే ఈ యుద్ధం ఇప్పుడే మొదలైంది!” అని పోస్ట్ పెట్టాడు. ఎన్టీఆర్ పోస్ట్ కి హృతిక్ తిరిగి కౌంటర్ ఇస్తూ.. ‘బాగుంది ఎన్టీఆర్ గారు! కానీ హ్యాష్‌ట్యాగ్ #HrithikvsNTR. ఇది కాంప్లికేట్ చేయకండి, సరే ?’ అంటూ హృతిక్ స్పందించాడు. ఎన్టీఆర్ మరోసారి స్పందిస్తూ.. ‘హృతిక్ సర్, #NTRvsHrithik అనే హ్యాష్‌ట్యాగ్ చాలా బావుంది. ఇప్పుడే నాకు విజయం వచ్చిందని అనుకుందాం!” అంటూ పోస్ట్ పెట్టాడు. మొత్తానికి ఇద్దరి మధ్య హ్యాష్ ట్యాగ్ ఫైట్ మాస్ లెవెల్‌లో సాగింది.