పల్ఘర్ సంఘటన పై హరీష్ శంకర్ ఎమోషనల్ ట్వీట్ !

మహారాష్ట్రలో జరిగిన పల్ఘర్ ఉరితీత సంఘటన దేశంలోనే ఒక రకమైన సంచలనాన్ని సృష్టించింది. ఈ సంఘటన పై మత కోణం కూడా తలెత్తుతోంది. అయితే దర్శకుడు హరీష్ శంకర్ ఈ సంఘటన పై స్పందిస్తూ.. “మహారాష్ట్రలో చోటు చేసుకున్న క్రూరమైన ఉరితీసిన సంఘటనతో తీవ్రంగా నిరాశ చెందాను. అయితే నా బాధ మతానికి లోబడి ఉండదు, ఎందుకంటే నేను మొదట మానవుడిని. దయచేసి హిందువులకు న్యాయం చేయండని ప్రచారం చేయవద్దు. మానవత్వానికి న్యాయం చేయాలని కోరదాం. అయినా మరణాల పై కూడా రాజకీయాలు చేస్తోన్న వాళ్ళను అలాగే మత పిచ్చి ఉన్న ప్రజలను చూసి నేను జాలిపడుతున్నాను. ఏమైనా హింస అస్సలు ఆమోదయోగ్యం కాదు తీవ్రంగా ఖండిస్తున్నాను’ అని హరీష్ శంకర్ పోస్ట్ చేశారు.

కాగా హరీష్ శంకర్ తన తరువాత సినిమాని పవన్ కళ్యాణ్ తో చేయబోతున్న సంగతి తెలిసిందే. గతంలో హరీష్, పవన్ కాంబినేషన్లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ పవన్ కెరీర్ లోనే ప్రత్యేకంగా నిలిచిపోయింది. అప్పటికే వరుస ప్లాప్స్ లో ఉన్న పవన్.. గబ్బర్ సింగ్ తో ఇండస్ట్రీ రికార్డ్స్ క్రియేట్ చేశాడు. దాంతో ఇప్పుడు హరీష్ – పవన్ చేయబోతున్న సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.

Exit mobile version